హైదరాబాద్​ ను పొగమంచు కప్పేసింది.. 

హైదరాబాద్​ లో వాతావరణం మారిపోయింది.  నగరంలోని రోడ్లను మంచు కప్పేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలో వాహనాదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.   ఈ రోజు ( డిసెంబర్​ 13)  ఉదయం 9 గంటలు అయితే మంచు తెరలు వీడకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ముందు వెళ్తున్న వెహికల్స్‌ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని జర్నీ చేస్తున్నారు.  వృద్దులు .. చిన్నారులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.  చలి తీవ్రత.. పొగమంచు కారణంగా తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లోఅలర్ట్​ జారీ చేశారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో డిసెంబర్​ 14,15 తేదీల్లో అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 16,17తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు