హైదరాబాద్​ లో శోభాయాత్ర..జైశ్రీరాం నినాదాలతో మారుమోగుతున్న సీతారాంభాగ్​

హైదరాబాద్​ లో  శోభాయాత్ర..జైశ్రీరాం నినాదాలతో మారుమోగుతున్న సీతారాంభాగ్​

శ్రీరామనవమి వాడ వాడలా ఘనంగా జరిగాయి.  హైదరాబాద్​లో శోభాయాత్ర ప్రారంభమైంది.  మంగళ్​హాట్​ పరిధి సీతారాంభాగ్​ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.  సీతారాంభాగ్ దగ్గర జై శ్రీరాం నామ స్మరణ మారుమోగుతుంది.

Also Read:-మానవుడై పుట్టి మాధవుడైనాడు శ్రీ రాముడు

శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.