హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇండోనేషియాలో గుండెపోటుతో మృతి చెందాడు. వంశీ కృష్ణ అనే వ్యక్తి ఈ నెల 13న భార్య శ్రావణితో కలిసి హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లాడు. ఈ జంట 22వ తేదీన ఉదయం సరదాగా గడిపేందుకు బాలిలోని పెన్నిడా ఐలాండ్ కు వెళ్లారు. అక్కడ సముద్ర చేపలను చూడడానికి వంశీ స్కూబా డైవింగ్ చేయాలనుకున్నాడు. ఆక్సిజన్ మాస్క్, డైవింగ్ షూస్ అన్నీ పెట్టుకొని అతను సముద్రంలోకి దిగాడు. అంతలోనే సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు.
అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహాన్ని గుర్తించారు. డైవింగ్ చేసినప్పుడు అతడికి హార్ట్ స్ట్రోక్ చనిపోయినట్లు తెలుస్తోంది. వంశీ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపు సాయంత్రానికి వంశీ మృతదేహం హైదరాబాద్‌కి చేరుకోనున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోలులో నివాసముంటున్న వంశీకృష్ణ గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. గ్రూప్–1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి, మెయిన్స్ రాసేందుకు సంసిద్దమవుతున్నాడు.