హైదరాబాద్ లో నకిలీ నిత్యవసర వస్తువులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజుకో చోట కల్తీ పదార్థాలు అమ్మే ముఠాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ చాయ్ పత్తా, సర్ప్ పౌడర్, సబ్బులు, కొబ్బరి నూనెలు అమ్ముతున్న రాజస్థాన్ ముఠాను టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..
లేటెస్ట్ గా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్ లో మిక్చర్, బూందీ తయారీ కంపెనీపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. మిక్షర్, బూందీ తయారీలో ఎక్స్ పైరీ అయిపొయిన కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే ఎక్స్ పైరీ అయిపోయిన మిక్షర్, బూందీ, పల్లి ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకుని.. కంపెనీని సీజ్ చేశారు.
డేట్ అయిపోయిన కెమికల్స్ తో తయారైన మిక్షర్, బూందీ, పల్లిలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితునితో పాటు, ఎక్స్ పైరీ అయిపోయిన కెమికల్స్, ఎక్స్ పైరీ అయిన తిను బండారాలను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు ఎస్ ఓటి పోలీసులు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు.