టెన్నిస్‌‌లోకి కేఎస్‌‌జీ ఎంట్రీ

టెన్నిస్‌‌లోకి కేఎస్‌‌జీ ఎంట్రీ

హైదరాబాద్‌‌, వెలుగు: రేసింగ్‌‌, వాలీబాల్‌‌, బ్యాడ్మింటన్‌‌, గోల్ఫ్‌‌, హ్యాండ్‌‌బాల్ తదితర ఆటల్లో తమ ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నడిపిస్తున్న హైదరాబాద్‌‌కు చెందిన కంకణాల స్పోర్ట్స్‌‌ గ్రూప్ (కేఎస్‌‌జీ) ఇప్పుడు టెన్నిస్‌‌లో అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా జర్మనీకి చెందిన 8 ఏండ్ల యంగ్ సెన్సేషనల్‌‌ ప్లేయర్‌‌‌‌ అరియా లాంక్రెసెంట్‌‌తో పదేండ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు సోమవారం ప్రకటించింది. 

ఈ టైమ్‌‌లో కేఎస్‌‌జీ టెన్నిస్ కార్యకలాపాలకు అరియా ముఖచిత్రంగా ఉండనుంది. 2034 వరకు అరియాకు కేఎస్‌‌జీ స్పాన్సర్‌‌‌‌షిప్ ఇవ్వడంతో పాటు ఆమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని ఆ గ్రూప్‌‌ అధినేత అభిషేక్ రెడ్డి తెలిపారు.