గ్రేటర్ హైదరబాద్ సిటీలో ఎయిర్ ట్యాక్సీలు నడపడానికి డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించిన టెక్నికల్ వర్స్ అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నాయని డ్రోగో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని శుక్రవారం తెలిపారు. కమర్షల్ ఎయిర్ ట్యాక్స్ సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ లో డ్రోన్లతో మనుషుల రవాణా చేయనున్నారు.
ఇక అటోలు, ట్యాక్సీలు ఎలా ఎక్కుతామో.. డ్రోన్లలో కూడా అలా కూర్చొని ట్రావెల్ చేయవచ్చు. ఎయిర్ ట్యాక్సీ హైదరాబాద్ సిటీలో ఎమర్జెన్సీ సర్వీసులకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు డ్రోగ్రో డ్రోన్స్ సీఈఓ యశ్వంత్ బొంతు అన్నారు.
ఇప్పటికే కంపెనీ అగ్రి డ్రోన్లపై ఫోకస్ పెట్టిందని, వ్యవసాయ రంగానికి మా కంపెనీ డ్రోన్స్ తో సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల్లో 30లక్షల ఎకరాల్లో పంటలకు పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో పాటు 3 డ్రోన్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని సీఈఓ చెప్పారు. టెక్నాలజీ టై అప్ కోసం ఇంటర్నేషనల్ నిపుణులతో డ్రోన్స్ డెవలప్ చేస్తున్నారు.