ఫ్రెష్​బస్​కు రూ.87 కోట్లు

ఫ్రెష్​బస్​కు రూ.87 కోట్లు

ముంబై: ఆల్-ఎలక్ట్రిక్ ఇంటర్‌‌సిటీ బస్ స్టార్టప్ ఫ్రెష్ బస్ మంగళవారం వీసీ ఫండ్​ మణివ్​ సారథ్యంలోని సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్‌‌లో 10.5 మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 87.5 కోట్లు) సేకరించినట్లు తెలిపింది.  ఈ రౌండ్‌‌లో షెల్ వెంచర్స్, ఆల్టెరియా క్యాపిటల్, ప్రస్తుత ఇన్వెస్టర్​ రివర్‌‌వాక్ హోల్డింగ్స్ కూడా పాల్గొన్నాయని ఫ్రెష్ బస్ తెలిపింది.   గత ఏడాది రెండు సీడ్ ఫండింగ్ రౌండ్‌‌లతో సహా మూడు ఫండింగ్ రౌండ్‌‌లలో ఇప్పటి వరకు సుమారు రూ.110 కోట్లు సేకరించినట్లు కంపెనీ తెలిపింది. 

ఈ  ప్లాట్‌‌ఫారమ్‌‌లో 20 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. బెంగళూరు--–తిరుపతి,  హైదరాబాద్--–విజయవాడ రూట్లలో దాని సేవలను అందిస్తోంది.  ఈ కొత్త ఫండ్ ఇన్ఫ్యూషన్‌‌తో 15 కొత్త రూట్లలో సేవలు అందిస్తామని, త్వరలో 150 ఈ--–బస్సులను ప్రారంభిస్తామని  ఫ్రెష్ బస్ ఫౌండర్​ సుధాకర్ చిర్రా అన్నారు.