కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో క్లీన్ ఎనర్జీ .. ప్రదర్శించిన హైలైనర్

కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో క్లీన్ ఎనర్జీ .. ప్రదర్శించిన హైలైనర్

హైదరాబాద్, వెలుగు: కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా క్లీన్ ఎనర్జీని తయారు చేసే విధానాన్ని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్టార్టప్ హైలైనర్ బుధవారం ప్రదర్శించింది.  సంస్థ ఇందుకోసం ఉపయోగిస్తున్న   లో– ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీ కోసం కేంద్రం నుంచి పేటెంట్  అందుకుంది. ఇది స్పేస్ అప్లికేషన్స్  కోసం వేడిని ఉత్పత్తి చేయడానికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది.

సంస్థ రూపొందించిన టెక్నాలజీని శీతల ప్రాంతాలలో గదిని వేడి చేయడం, ఇండ్ల కోసం ఇండక్షన్ హీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పారిశ్రామిక అవసరాల కోసం వాడవచ్చు. ఈ సందర్భంగా సంస్థ తమ ప్రొడక్టులను ప్రదర్శించింది. వంద వాట్ల ఎలక్ట్రికల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ నుంచి స్థిరమైన 150 వాట్స్ సమానమైన వేడిని ఉత్పత్తి చేసి చూపించారు.  దేశవిదేశీ మార్కెట్లలోకి తమ ఉత్పత్తులను తీసుకురావడానికి త్వరలో పది మిలియన్ డాలర్లను సేకరిస్తామని ఈ స్టార్టప్ ప్రకటించింది.