
- 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్
- ఎస్టీఎఫ్ దాడులతో వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ హోలీ వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. ఇంతకాలం చాక్లెట్లతో పాటు వివిధ రకాలుగా దొరికిన గంజాయి.. ఈ సారి కుల్ఫీ, బర్ఫీ, సిల్వర్ కోటెడ్ బాల్స్ రూపంలో లభ్యమైంది. హోలీ సంబరాలను ఆసరాగా చేసుకున్న పలువురు అక్రమార్కులు గంజాయి కుల్ఫీ, గంజాయి బర్ఫీ, గంజాయి సిల్వర్బాల్స్ అంటూ గుట్టుగా అమ్మకాలు సాగించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ఎస్టీఎఫ్పోలీసులు ఆకస్మిక దాడుల్లో.. లోయర్ ధూల్‌పేట్‌లోని మల్చిపురాలో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి మల్చిపురాలో రోజూ కుల్ఫీ ఐస్ క్రీమ్స్అమ్మేవాడు. హోలీ పండుగ రోజు గంజాయిని కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బర్ఫీ స్వీట్లో కలిపి.. అలాగే, గంజాయిని సిల్వర్ కోటెడ్ బాల్స్ లా తయారు చేసి గుట్టుగా విక్రయించాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ఎస్టీఎఫ్పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి వాటిని పట్టుకున్నారు. గంజాయితో తయారైన 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడు సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు ఎస్టీఎఫ్టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. అలాగే, ధూల్‌పేటలోని బలరాం గల్లీలో బల్దేవ్ సింగ్ వద్ద 456 గ్రాములున్న 32 గాంజా గోలీలను , బేగంబజార్ లో తోట గంగాధర్ దగ్గర108 బాక్సుల్లో ఉన్న 792 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అంజిరెడ్డి చెప్పారు.