అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ కు చెందిన  ఓ స్టూడెంట్  బ్రెయిన్‌స్ట్రోక్‌తో కన్నుమూశాడు.  సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చెందిన  రుత్విక్ రాజన్ (30) రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ టెక్సాస్‌ యూనివర్సిటీలో ఇటీవల ఎంఎస్‌ డిగ్రీ పూర్తి చేశాడు.అక్కడే జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. 

తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళ్లిన రుత్విక్ సడన్ గా కింద పడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతను బ్రెయిన్‌స్ట్రోక్‌తో మరణించినట్లు నిర్ధారించారు. రుత్విక్ స్నేహితుడు శ్యామ్ రుత్విక్ చికిత్స కోసం విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని ఏర్పాటు చేశారు. 

దాదాపుగా1,200 మంది వ్యక్తుల నుండి $57,000 డాలర్లు సేకరించారు.   రుత్విక్‌ను మరణవార్త విని అతని తల్లిదండ్రులు, కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి పెద్దదిక్కు అవుతాడని భావించామని కుటుంబ సభ్యులు వాపోయారు.