హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే యువకుడు అమెరికాలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. రోజూ ఇంటికి ఫోన్ చేసే మాట్లాడే అర్ఫాత్ కొద్దిరోజులుగా ఇంటికి ఫోన్ చేయలేదు. హైదరాబాద్ లో ఉంటున్న తన పేరెంట్స్ కాల్ చేసినా కూడా ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. దీంతో ఆందోళన చెందిన తన తండ్రి మహమ్మద్ సలీం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అర్ఫాత్ కనిపించట్లేదని యూఎస్ లో కూడా కంప్లైంట్ నమోదయ్యిందని తేలింది.
అమెరికాలోని అర్ఫాత్ బంధువు ఈ మేరకు కంప్లైంట్ చేయగా అక్కడ కూడా నెల రోజుల నుండి ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదిలా ఉండగా నాచారంలోని అర్ఫాత్ బంధువును 1200 యూఎస్ డాలర్లు డిమాండ్ చేస్తూ ఒక కాల్ వచ్చింది. అయితే, సదరు కాలత్ పేమెంట్ మోడ్ లాంటి ఇతర వివరాలేవీ చెప్పలేదు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు కూడా కాలర్ డీటెయిల్స్ కానీ, అర్ఫాత్ ఆచూకీ కానీ లభించలేదు. అర్ఫాత్ ఆఖరిగా వాల్ మార్ట్ దగ్గర కనిపించాడని అక్కడి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఆ సమయంలో అతను వైట్ టీషర్ట్, రెడ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. ఇంతకు మించి అర్ఫాత్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా, న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ కూడా ఈ కేసుపై పనికి చేస్తోంది.