హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. సకాలంలో స్కూల్కు చేరేందుకు కొంత మంది విద్యార్థులు ట్రాక్టర్‌లో బయల్దేరారు. గద్వాల జిల్లా రాజోలి మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పరిసర గ్రామాల స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ప్రతిరోజు పచ్చర్ల గ్రామం నుంచి విద్యార్థులు బస్సులో వెళ్తుంటారు.
ALSO READ :- బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అయితే గత నాలుగైదు రోజులుగా బస్సు సరిగ్గా రావడం లేదు. ఇవాళ ఉదయం 11:40 దాటినా కూడా బస్సు రాలేదు. దీంతో చివరకు ట్రాక్టర్‌లో ఎక్కి స్కూల్కు వెళ్లారు.