
- ముల్కీ ఉద్యమం ఆంధ్రా గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నినాదాలతో ప్రారంభమైంది.
- విద్యార్థులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి 1952 జులై 26న వరంగల్ వేలాది మంది తో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు.
- సీఎం బూర్గుల రామకృష్ణారావు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వరంగల్‌లో విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ మరోసారి బ్రహ్మాండమైన ప్రదర్శన జరిపిన తేదీ 1952 ఆగస్టు 27.
- హన్మకొండలో విద్యార్థులపై పోలీసులు 1952 ఆగస్టు 30వ తేదీన లాఠీఛార్జీ జరిపారు.
- హైదరాబాద్‌లో విద్యార్థులు నాన్ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ నినాదాలతో 1952 సెప్టెంబర్ 2న భారీ ర్యాలీ నిర్వహించారు.
- విద్యార్థులపై జరిపిన కాల్పులపై విచారణకు 1952 సెప్టెంబర్ 5న ప్రభుత్వం జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి కమిటీ వేసింది.
- ముల్కీ నిబంధనలకు బూర్గుల ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని 1952 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేసింది.
- ముల్కీ ఉద్యమంలో బారిష్ట కిషన్‌కు సర్ నిజామత్‌జంగ్, బారిష్టర్ అక్బర్ అలీఖాన్ సహకరించారు.
- హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించి 1952లో నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం నడిపిన శాసనసభ్యుడు పి.రామాచారి.
- జగన్మోహన్రెడ్డి కమిటీ నివేదికను 1952 డిసెంబర్ 28న సమర్పించింది.
- 1954 జూన్, 7, 8వ తేదీల్లో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్‌లోని తెలంగాణ ప్రాంత సభ్యులు హైదరాబాద్‌లో సమావేశమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
- అప్పటి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాలాంధ్రను సమర్థించారు.
- విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని కాంగ్రెస్ నాయకులు బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగరావు గట్టిగా సమర్థించారు.
- స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును 1948లో ఎస్.కె.థార్ కమిషన్‌ను నియమించారు.
- భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1949లో జేవీపీ కమిటీ ఏర్పాటు చేసింది.
- 1953లో రాష్ట్రాల ఏర్పాటుపై వాంఛూ కమిటీ వేసింది.
- 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
- నూతన రాష్ట్రాల ఏర్పాటు, సమస్యల అధ్యయనం కోసం 1953 డిసెంబర్ 22న రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసింది.
- రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ.
- ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్‌ను 1954 జూన్, జులై సందర్శించింది.
- విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలనే వారికి కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు.
- 1955 సెప్టెంబర్ 30న ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్‌ను సందర్శించింది.
- ఏయే ప్రాంతాన్ని కలుపుతూ హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ బీదర్ జిల్లాను మునగాల పరిగణా ప్రాంతాన్ని సిఫారసు చేసింది.
- 1961 జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో 2/3వ వంతు సభ్యులు విలీనానికి ఒప్పుకుంటే ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా రూపొందించవచ్చని ఫజల్ అలీ కమిషన్ పేర్కొంది.
- ఫజల్ అలీ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్విభజన సంఘం వాదనలంతా విశాలాంధ్రను బలపరిచేదిగాను, డిక్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉందని తెన్నేటి విశ్వనాథం వ్యాఖ్యానించారు.
- విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని 1955 అక్టోబర్ 22న న్యూఢిల్లీలో కేవీ రంగారెడ్డి స్పష్టంగా చెప్పాడు.
- హైదరాబాద్ దక్కన్ చరిత్రలో అక్కన్న మాదన్నల తర్వాత ఒక రాజనీతిజ్ఞుడిగా, ముఖ్యమంత్రిగా, పరిపాలనాధ్యక్షుడిగా పేరు సాధించిన సీఎం బూర్గుల రామకృష్ణారావు.
- ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ 1956, ఫిబ్రవరి 20.
- పెద్ద మనుషుల ఒప్పందానికి తెలంగాణ ప్రాంతం నుంచి హాజరైన నాయకులు బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నరసింగరావు.
- పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 14 అంశాలపై రక్షణలు కల్పించారు.
- పెద్ద మనుషుల ఒప్పందంలో ఉద్యోగాల్లో చేరడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 ఏండ్లు నివాసం ఉండి తీరాలని నిర్ణయించారు.
- పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ పరిపాలన, న్యాయ శాఖల్లో ఉర్దూ భాషకు ఉన్న స్థానాన్ని ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు.
- పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయు భూముల అమ్మకం తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆధీనంలో ఉండాలి.
- పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని 371 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏర్పరచాలి.
- పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉంచాలని కోరుకున్నారు.
- పెద్ద మనుషుల ఒప్పందానికి ముల్కీ ఉద్యమం కారణభూతమైంది.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడక ముందు ఉత్తరాది నుంచి ముస్లింలు, కాయస్త బ్రాహ్మణులు వచ్చి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నతోద్యోగాలు సంపాదించుకొనేవారు.
- 1916లో ముల్కీ ఉద్యమాన్ని బారిష్టర్ కిషన్ ప్రారంభించారు.