విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌‌ ఓటమి

విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌‌ ఓటమి

అహ్మదాబాద్‌‌ : విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌‌కు తొలి ఓటమి ఎదురైంది. బ్యాటింగ్‌‌లో తన్మయ్‌‌ అగర్వాల్‌‌ (64), ఆరవెల్లి అవనీష్  (52), అభిరత్‌‌ రెడ్డి (35) రాణించినా మిగతా వారు నిరాశపర్చడంతో.. సోమవారం జరిగిన గ్రూప్‌‌–సి రెండో మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ 3 వికెట్ల తేడాతో ముంబై చేతిలో ఓడింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన హైదరాబాద్‌‌ 38.1 ఓవర్లలో 169 రన్స్‌‌ చేసింది.

ముంబై బౌలర్లు అథర్వ అంకోలేకర్‌‌ (4/55), ఆయుష్‌‌ మాత్రే (3/17), తనుష్‌ కోటియన్‌‌ (2/38) దెబ్బకు హైదరాబాద్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. ఛేజింగ్‌లో ముంబై 25.2 ఓవర్లలో 175/7 స్కోరు చేసి నెగ్గింది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (44 నాటౌట్‌‌), తనుష్‌(39 నాటౌట్‌‌), ఆయుష్‌‌ (28)నిలకడగా ఆడారు. నిశాంత్‌‌ 3, ముదాసిర్‌‌ 2 వికెట్లు పడగొట్టారు. తనుష్‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.