సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో..హైదరాబాద్‌‌కు మూడో ఓటమి

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో..హైదరాబాద్‌‌కు మూడో ఓటమి

రాజ్‌‌కోట్‌‌ : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో హైదరాబాద్‌‌ జట్టు మూడో పరాజయం మూటగట్టుకుంది.  ఆదివారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో హైదరాబాద్ 7 రన్స్ తేడాతో పంజాబ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. అన్మోల్‌‌ప్రీత్ సింగ్ (60) ఫిఫ్టీతో మెరిశాడు. రవితేజ, అజయ్‌‌దేవ్‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఛేజింగ్‌‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 189 రన్స్‌‌కు ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌ రోహిత్ రాయుడు (56), ఆల్‌‌రౌండర్ సీవీ మిలింద్‌ (55), మికిల్‌‌ జైస్వాల్ (39) పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్ నమన్ ధీర్‌‌‌‌ ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు. ఐదు మ్యాచ్‌‌ల్లో రెండే గెలిచి మూడింటిలో ఓడిన హైదరాబాద్ 8 పాయింట్లతో  గ్రూప్‌‌–ఎలో ఐదో స్థానంలో నిలిచింది.  మంగళవారం మధ్యప్రదేశ్‌‌తో తలపడనుంది.