వానలకు వాతావరణం చల్లబడింది అనుకునేలోపే..ఎండలు మళ్లీ మోపయ్యాయి

వానలకు వాతావరణం చల్లబడింది అనుకునేలోపే..ఎండలు మళ్లీ మోపయ్యాయి

గ్రేటర్​ సిటీలో ఎండలు మళ్లీ మోపయ్యాయి. ఇటీవల కురిసిన వానలకు వాతావరణం చల్లబడింది అనుకునేలోపే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. ఉదయం 9 గంటల తర్వాత జనం ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు.

శుక్రవారం గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం టైంలో జన సంచారం తగ్గి ప్రధాన రోడ్లు ఖాళీగా కనిపించాయి.