డోంట్ కేర్ బ్రో.. : వార్నింగ్ బోర్డుల పక్కనే బర్త్ డే పార్టీలు..

డోంట్ కేర్ బ్రో.. :  వార్నింగ్ బోర్డుల పక్కనే బర్త్ డే పార్టీలు..

ట్యాంక్ బండ్ పై బర్త్ డే పార్టీలు, కేక్ కటింగ్స్ నిషేధం.. ఎవరైనా అలా చేస్తే జరిమానా వేస్తాం.. జైలుకు పంపుతాం అంటూ బోర్డులు, బ్యానర్లు పెట్టారు.. పార్టీ చేసుకున్న సంగతి ఎలా తెలుస్తుంది అనే డౌట్ వస్తే.. దానికి కూడా క్లారిటీ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. మీ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి.. వాటిలో చూసి మీకు శిక్షలు వేస్తాం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది జీహెచ్ఎంసీ.. ఇలా బోర్డులు, హోర్డింగ్స్, బ్యానర్లు పెట్టారు సరే.. హైదరాబాదీ యూత్ విన్నారా.. చూశారా అంటే మాత్రం.. అబ్బే ఐ డోంట్ కేర్ బ్రో అంటోంది యూత్.. 

ట్యాంక్ బండ్ పై నిషేధం బోర్డుల పక్కనే.. అర్థరాత్రి బర్త్ డే పార్టీలు సెలబ్రేట్ చేసుకున్నారు యూత్. అక్కడే కేక్ కటింగ్స్ చేశారు. హ్యాపీ బర్త్ డే అంటూ కేరింతలు కొట్టారు.. వీటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశేషం ఏంటంటే వార్నింగ్ సైన్ బోర్డు పక్కనే.. ఈ బర్త్ డే పార్టీ జరగటం.. అక్కడే కేక్ కటింగ్ జరగటం.

మొత్తానికి జీహెచ్ఎంసీ ఎంత వార్నింగ్ ఇచ్చినా.. ఐ డోంట్ కేర్ బ్రో అంటూ లైట్ తీసుకుని.. ట్యాంక్ బండ్ పై మిడ్ నైట్ లైటింగ్ లో కుర్రకారు బర్త్ డే పార్టీలు జోరుగా సాగుతున్నాయి.. ఏదిఏమైనా కుర్రోళ్లు వాళ్లు.. ఆ మాత్రం లేకపోతే ఎలా.. ప్రతిదానికీ ఆంక్షలేనా అంటూ నెటిజన్లు సైతం వాళ్లకు సపోర్ట్ చేయటం విశేషం.. బర్త్ డే పార్టీల వరకు అయితే ఓకే.. అంతకు మించి చేష్టలు చేస్తేనే ఇబ్బంది.. ఇది ఇక్కడితో ఆగితే ఓకే.. శృతిమించితే బాగుండదు అనే వాళ్లూ లేకపోలేదు.. 

ఏదిఏమైనా ట్యాంక్ బండ్ పై వార్నింగ్ సైన్ బోర్డు పక్కనే పార్టీ ఫొటోలు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి సోషల్ మీడియాలో...