
- మొదటి రోజు అంతా సాఫీగా. ..
- శుక్రవారం నుంచి 15 రోజుల పాటు ట్రయల్‌రన్
తార్నాక, వెలుగు: ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా తార్నాకలో బంద్‌చేసిన జంక్షన్‌ను ట్రాఫిక్పోలీసులు మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ యూ టర్న్చాలా దూరం ఉండడం, ట్రాఫిక్‌జామ్‌కు కారణం అవుతుండడంతో కొంతకాలం తార్నాక జంక్షన్తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రయల్‌రన్‌లో భాగంగా శుక్రవారం జంక్షన్మధ్యలో ఉన్న డివైడర్లను తెరిచి మునుపటిలా వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు. ఈ ట్రయల్‌రన్15 రోజుల పాటు అమలు చేయనున్నారు.
ఈ పక్షం రోజులు ఏఏ ఇబ్బందులు తలెత్తుతాయో పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. అయితే, మెట్టుగూడ నుంచి వచ్చేవారు ఓయూ రూట్లోకి, హబ్సిగూడ నుంచి వచ్చేవారు లాలాపేట్వైపు వెళ్లడానికి పర్మిషన్ఇవ్వలేదు. వీరు మునుపటి లాగానే యూ టర్న్తీసుకుని వెళ్లారు. ఉస్మానియా వర్సిటీ నుంచి లాలాపేట్, హబ్సిగూడ వైపు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. లాలాపేట్ నుంచి వచ్చేవారికి మాత్రం ఓయూలోకి, సికింద్రాబాద్‌వైపు వెళ్లేలా పర్మిషన్ఇచ్చారు. దీని ఆధారంగా మరికొన్ని చోట్ల ఎత్తేసిన జంక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురావదడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాగే కొనసాగించాలి
నేను రోజు లాలాపేట్ నుంచి నల్లకుంట వెళ్తా. ఇంతకుముందు యూ టర్న్ ఉండడంతో హబ్సిగూడ ఐఐసీటీ దగ్గర యూటర్న్తీసుకోవాల్సి వస్తుండే...దీంతో ట్రాఫిక్‌జామ్‌తో పాటు టైం వేస్ట్అవుతుండే...తార్నాక జంక్షన్ఓపెన్చేయడం వల్ల ఆ ఇబ్బందులు తప్పాయి. దీన్ని ఇలాగే కొనసాగించాలి.
- ఎస్ పీ రెడ్డి, వాహనదారుడు
ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ ఓపెన్ చేయాలె
నేను తార్నాక స్ట్రీట్ నంబర్3లో ఉంటా. పని మీద రోజు ఓయూ మీదుగా నల్లకుంటకు పోతా..ఇంతకుముందు యూటర్న్‌తో సుమారు అర కిలోమీటర్ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు తిప్పలు తప్పినట్టే. ఉదయం, సాయంత్రం వేళల్లో తార్నాక సెయింట్‌ఆన్స్ స్కూల్ పిల్లలు రావడం, పోవడం చేస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య వస్తుంది. అది రిపీట్ కాకుండా చూడాలి.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ కూడా ఆన్‌చేస్తే బాగుంటుంది. – కంటి వీరన్న, తార్నాక