
హైదరాబాద్ సిటీ, వెలుగు: యూటర్న్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా కొన్నేండ్ల కింద మూత పడిన తార్నాక జంక్షన్త్వరలోనే తెరుచుకోనుంది. ట్రాఫిక్అధికారులు శుక్రవారం నుంచి 15 రోజుల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ జంక్షన్ ఓపెన్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చే వాహనాలు నేరుగా లాలాపేట, హబ్సిగూడ వైపు వెళ్లవచ్చు. లాలాపేట నుంచి వచ్చే వాహనాలు డైరెక్ట్ ఓయూ, మెట్టుగూడ వైపు వెళ్లొచ్చు. మెట్టుగూడ నుంచి వచ్చే వాహనాలు ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లడానికి మాత్రం అనుమతి లేదు. హుడా కాంప్లెక్స్ వద్ద యూ-టర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
హబ్సిగూడ నుంచి వచ్చే వాహనాలు కుడి వైపు అంటే లాలాపేట వైపు వెళ్లడానికి పర్మిషన్లేదు. మెట్రో స్టేషన్దాటిన తర్వాత ఇంతకుముందు ఉన్న ప్లేస్లో యూ-టర్న్ తీసుకుని, తార్నాక జంక్షన్‌లో ఎడమవైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లాలి. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని, ట్రయల్ రన్ లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్డేవిస్కోరారు. ట్రయల్ రన్ లో వచ్చే ఇబ్బందులను పరిశీలించి జంక్షన్ దగ్గర మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు.