అర్థరాత్రి రిసార్ట్ పై పోలీసులు దాడి.. వాగ్వాదానికి దిగిన టెక్కీలు

అర్థరాత్రి రిసార్ట్ పై పోలీసులు దాడి.. వాగ్వాదానికి దిగిన టెక్కీలు

 హైదరాబాద్ లోని  ఓ రిసార్ట్ లో  అర్థరాత్రి పోలీసుల దాడి చేశారు. అయితే పోలీసులు అర్థరాత్రి రిసార్ట్ కు వచ్చి తమను వేధించారంటూ టెక్కీలు ఆరోపిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్  హైదరాబాద్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈగలపెంటలోని రిసార్ట్‌లో ఉన్నారు.  తనకు స్నేహితుడికి సుమారు రూ.8వేలకు డబుల్ రూమ్ బుక్ చేసుకున్నారు.  అయితే వీకెండ్ ట్రిప్ కోసం వచ్చిన మరో ఇద్దరు స్నేహితులు  రిసార్ట్ లో వేరే గది కోసం   రిసార్ట్‌కు ఫోన్ చేశారు. అయితే  రూం ఖాళీ లేకపోవడంతో   వాళ్లు  ఒకే గదిలో బెడ్స్  అరెంజ్ చేశారు.   దీంతో  ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు,  ముంబై సినిమాటోగ్రాఫర్‌  ఒకే గదిలో ఉన్నారు.

జూన్ 22 అర్థరాత్రి 1.30 గంటలకు   పోలీసులు  రిసార్ట్ లో తనిఖీలు చేశారు.  ముగ్గురు పోలీసులు అకస్మాత్తుగా వచ్చి వాళ్లు ఉంటున్న గది తలుపు తట్టారు.  పురుషులు, స్త్రీలు  పెళ్లి చేసుకోకుండా ఒకే గదిలో ఉన్నారని  భారతీయ సంస్కృతికి ఇది విరుద్ధమంటూ  వారిని ప్రశ్నించారు. ఆధార్, ఐడీ ఫ్రూప్స్ చూపెట్టాలంటూ  హోటల్ నుంచి బయటకు నెట్టుకొచ్చారు. అయితే దీనిపై టెక్కీలు అభ్యంతరం తెలిపారు. పోలీసులు తమను కావాలనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అనుకోని పరిస్థితుల్లో ఒకే గదిలో ఉండాల్సి వచ్చిందని చెబుతున్నా పోలీసులు వినడం లేదని వాపోయారు.

ఒకే గదిలో  నలుగురు పురుషులు .. మహిళలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉంటున్నారని పోలీసులు  మమ్మల్ని దూషించారు.  మమ్మల్ని  పై నుండి క్రిందికి చూస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. అర్థరాత్రి  పోలీసుల్లో ఒక్క  మహిళా పోలీసు అధికారి కూడా లేరు.  పోలీసులు తీరు వల్ల మేం ఇబ్బందికరంగా..  అసౌకర్యంగా భావించాము. మేము స్నేహితులం..  ఒక గదిలో ఉన్నామని  చెప్పినా వినలేదు. ఐడీ కార్డులు చూపెట్టాలని వేధించారు.   మేము ఈ ఘటనను  రికార్డ్ చేయడం ప్రారంభించిన వెంటనే  పోలీసులు మాట మార్చి...  భద్రత గురించి మాట్లాడారు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే తమను వేధించారు. అని రిసార్ట్ లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరణి మజుందార్  ఆరోపించారు.