హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ స్కామ్..46 లక్షల జీతం.. పార్టీకి 45 లక్షలు విరాళం ఇచ్చినట్లు క్లెయిమ్

హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ స్కామ్..46 లక్షల జీతం.. పార్టీకి 45 లక్షలు విరాళం ఇచ్చినట్లు క్లెయిమ్

ఐటీ ఉద్యోగులు చాలా తెలివి గల వారని తెలుసు..ఇంత స్మార్ట్ అని మాత్రం తెలియదు. ఐటీ రిటర్స్న్ కోసం  వచ్చిన జీతం మొత్తం పార్టీలకు విరాళం ఇచ్చినట్లు ఐటీ రిటర్న్స్ కు క్లెయిమ్ చేసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 30 కంపెనీలకు చెందిన ఐటీ ఉద్యోగులు దాదాపు రూ. 110 కోట్ల ఐటీ రిటర్స్న్ స్కామ్ చేశారు. ఇక ఐటీ శాఖ చూస్తూ ఉంటదా..సెక్షన్ 80GCC  కింద తప్పుడు మార్గంలో ఐటీ రిటర్స్స్ కోసం దాఖలు చేసిన వారిపై చర్యలకు సిద్దమైంది.. 2021-22 నుంచి 2023-24 వరకు ఐటీ రిటర్స్స్ సంబంధించిన స్కూట్నీ లో ఈ స్కామ్ బయటపడింది. 

హైదరాబాద్లో దాదాపు30 కంపెనీలకు చెందిన ఉద్యోగులు..రిజిస్టర్ చేయబడని గుర్తింపులేని పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు ఐటీ రిటర్స్స్ కు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది.పొలిటికల్ పార్టీలకు  విరాళాల ద్వారా రాయితీలు పొందే ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80GCCని ఉపయోగించుకొని ఆర్థిక లాభం కోసం ఐటీ నిపుణులు మోసం చేసినట్లు గుర్తించారు. 

హైదరాబాద్ లోని 36 కంపెనీలకు చెందిన ఐటీ నిపుణులు పొలిటికల్ విరాళం ముసుగులో ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేసిన రూ.110 కోట్ల రీఫండ్ స్కామ్‌ను ఐటీ శాఖ దర్యాప్తులో బయటపెట్టింది.రూ.46 లక్షల జీతం ఉన్న ఒక ఐటీ ఉద్యోగి ఒక పార్టీకి రూ.45 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు చెప్పుకోవడం విచారణ అధికారులను ఆశ్చ ర్యానికి గురి చేసింది. రిటర్న్‌లను దాఖలు చేసే ఐటీ ఉద్యోగులు ఉపయోగించే సాధారణ ఇమెయిల్ చిరునామాను పరిశోధకులు ట్రాక్ చేసినప్పుడు స్కామ్ విషయం బయటపడింది. 

ఇక ఈ స్కామ్ లో గుజరాత్, తెలంగాణ తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు విరాళాలు ఇచ్చిన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయలేదు.. కనీసం ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేదని తేలింది. ఇలా చేసిన ఐటీ ఉద్యోగులపై ఐటీ శాఖ చర్యలకు సిద్దమయింది. వారి రీఫండ్ క్లెయిమ్ లను తిరస్కరించే యోచనలో ఉంది.. సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది.  

సెక్షన్ 80GGCని ఫ్రాడ్ జరగకుండా ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.  హైదరాబాద్‌లోని దాని దర్యాప్తు విభాగం ఆ 30  కంపెనీలలో ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉద్యోగులు పన్ను రిటర్న్‌లలో మోసపూరిత క్లెయిమ్‌లు  చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.