హైదరాబాద్ లో ఎండవేడి దంచికొడుతోంది. గురువారం ( మే 2) గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కాగా ఈ రోజు మే3 న మధ్యాహ్న వేళ హైదరాబాద్‌లో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. వేడిగాలులు.. ఉష్ణోగ్రత కూడా పెరిగిందని IMD తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం హైదరాబాద్‌లో రాబోయే ఐదు రోజులు( మే 4 నుంచి) ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలకు కి చేరుకునే అవకాశం ఉందని.... కనిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేస్తునారు.
భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది. గురువారం మే 2న బంజారాహిల్స్, సికింద్రాబాద్, న్యూ మెట్టుగూడ(Banjara Hills, Secunderabad, New Mettuguda)లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ నాలుగో వారం నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే ఈ ఏడాది 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదు రోజుల( మే 4 నుంచి) పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయనిIMD తెలిపింది. దక్షిణ- తూర్పు దిశలో ఉపరితల గాలులు 4నుంచి8 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది (2024) ఫిబ్రవరి లోనే ఎండాకాలం రాగా.. రోజు రోజుకు పెరుగుతూ ఏప్రిల్ 10నుంచి దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణ విభాగం ప్రజలను హెచ్చిరించింది.