తెలంగాణకు 2 బుల్లెట్ రైళ్లు : బెంగళూరు, చెన్నైలకు 2 గంటలే జర్నీ

తెలంగాణకు 2 బుల్లెట్ రైళ్లు : బెంగళూరు, చెన్నైలకు 2 గంటలే జర్నీ

హైదరాబాద్ నుండి బెంగళూరుకు రైలు ప్రయాణం తగ్గనుంది.. ఇకపై ఫ్లైట్ జర్నీ చేసినంత సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రైన్ లో వెళ్ళచ్చు. ఇటీవల కేంద్రం ప్రకటించిన హై స్పీడ్ రైలు కారిడార్లతో హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాలకు రైలులో రెండు గంటల్లో.. అంటే ఫ్లైట్ జొర్నీతో సమానంగా వెళ్లే అవకాశం ఉంది. హై స్పీడ్ కారిడార్ల రాకతో హైదరాబాద్ నుండి బెంగళూరు చెన్నై నగరాలకు 10 గంటల పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. 

ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్టుకి  విమాన సమయం 1 గంట 15 నిమిషాలు. హైదరాబాద్ నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 1 గంట 15 నిమిషాలుగా ఉంది.. ఫ్లైట్ జర్నీ కాకుండా..  సిటీ సెంటర్స్ ను చేరుకోవడానికి మరో 2 3 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకి బుల్లెట్ ట్రైన్లో కేవలం 2 గంటల్లోనే వెళ్లే అవకాశం ఉంది. అదే చెన్నైకి వెళితే..  2 గంటల 20 నిమిషాలు పెట్టె అవకాశం ఉంది..  ఇది ఫ్లైట్ జర్నీతో సమానం.

Also Read :- తిరుమల లడ్డూ వివాదం దురదృష్టకరం

సో.. ఇకపై హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైలకు వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదన్నమాట. అయితే.. బుల్లెట్ ట్రైన్ టికెట్ కి టికెట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.