
గ్రేటర్ హైదరాబాద్ సిటీ డెవలప్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ వ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు.. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు బడ్జెట్ లో ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా H-..CITI ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.
ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 31 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 17 అండర్ పాస్ లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. వీటితోపాటు నగరంలోని 10 రహదారులను విస్తరించి.. ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయబోతున్నట్లు స్పష్టం చేశారాయన.
వీటన్నింటికీ 7 వేల 032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నాం అని వివరించిన మంత్రి భట్టి.. మరో 150 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీ సుందరీకరణ పనులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.
ALSO READ : ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు
హైదరాబాద్ సిటీ భవిష్యత్ అవసరాలు, రాబోయే రోజుల్లో పెరగనున్న బైక్స్, కార్లు, ఇతర వాహనాల రద్దీకి అనుగుణంగా హై సిటీ ప్రణాళికలో భాగంగా కొత్త ఫై ఓవర్లు, అండర్ పాస్ లను నిర్మాణం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారాయన.