
హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్ డెవెలపర్ కాసాగ్రాండ్ హైదరాబాద్‌లో నాలుగు లగ్జరీ ప్రాజెక్టులను ప్రారంభించినట్టు ప్రకటించింది. విల్లాలు, అపార్ట్‌మెంట్‌లతో కూడిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులను హైదరాబాద్‌లోని మంఖల్, అత్తాపూర్, గౌడవల్లి, కొంపల్లిలో నిర్మిస్తున్నామని తెలిపింది. మొత్తం 2.74 మిలియన్ చదరపు అడుగుల్లో 3,4 బెడ్రూమ్ల అపార్టుమెంట్లను నిర్మిస్తారు.
ధరలు రూ.1.4 కోట్ల నుంచి మొదలవుతాయి. వీటి కోసం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ అరుణ్ అన్నారు. హైదరాబాద్‌లో మొదటిసారిగా 2023లో తమ మొదటి ప్రాజెక్ట్ కాసాగ్రాండ్ హాన్ఫోర్డ్ను ప్రారంభించాక, ఇక్కడ మార్కెట్‌ను బాగా అర్థం చేసుకున్నామని చెప్పారు. చెన్నై నుంచి పనిచేసే కాసాగ్రాండ్ కోయంబత్తూర్, బెంగళూరులో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది.