న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ తరహాలో..హైదరాబాద్ లో వీడియో బిల్ బోర్డులు

అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్ స్వ్కేర్ తరహాలో హైదరాబాద్ లోనూ టీ–స్క్వేర్ నిర్మాణం కాబోతోంది. టైమ్స్‌ స్క్వేర్‌ లాగా ఐకానిక్‌లా కనిపించేలా ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాయదుర్గంలో నెలకొల్ప నున్నఈ ప్రాజెక్టు  కోసం ఆర్కిటెక్చరల్, లావాదేవీల సలహా సేవల కోసం టెండర్లును ఆహ్వానిస్తోంది. 

రాయ దుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టీ-స్క్వేర్ నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. టీ స్క్వేర్ నిర్మాణం పూర్తయితే వెస్ట్ జోన్ కు కొత్త అందం రానుంది. ఇక్కడి కమ్యూనిటీకి సౌకర్యవంతమైన, ఆకర్షణీయ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కట్టడం నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలోని వెస్ట్ జోన్‌లో ఉన్న హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు సైబరాబాద్‌గా ప్రసిద్ధి చెందాయి. ఇది 100 కంటే ఎక్కువ పెద్ద ఐటీ కంపెనీలు, గ్లోబల్ కంపెనీలకు నిలయంగా మారడంతో పాటు దాదాపు పది లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. 

టీ-స్క్వేర్‌ ప్రాజెక్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం, బిడ్‌ల దాఖలుకు ఆగస్టు 9 చివరి తేదీ. ఆర్కిటెక్ట్ కమ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఎంపిక విధానం క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ అని పేర్కొంది. ఇక్కడ ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు వీలుంటుంది. సమావేశాలకు స్థలాన్ని కూడా కేటాయిస్తారు. 

న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్ యూఎస్‌లో వాణిజ్య కూడలి, పర్యాటక ప్రదేశం, వినోద కేంద్రంగా ఉంది. వ్యాపారాలు ప్రకటనలు చేయడానికి వీలుగా అనేక డిజిటల్ బిల్‌బోర్డ్‌ల ద్వారా ఇది వెలిగిపోతుంది. రాయదుర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ప్రతిపాదిత టీ-స్క్వేర్ హైదరాబాద్ టైమ్స్ స్క్వేర్‌గా పనిచేస్తుంది.

ALSO READ | Supreme Court: హైవేను అలా బ్లాక్ చేయొచ్చా?..హర్యానా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్