హైదరాబాద్​లో మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్​లో మిస్ వరల్డ్ పోటీలు
  • -మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక కానున్న నగరం
  • మే 7 నుంచి 31 వరకు కాంటెస్ట్.. పాల్గొననున్న 120 దేశాలు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్​కు వేదిక కాబోతున్నది. ఈ ఏడాది జరగనున్న మిస్​వరల్డ్​ అందాల పోటీలకు హైదరాబాద్​ఆతిథ్యం ఇవ్వనున్నది. ‘మిస్​వరల్డ్ ​ఫెస్టివ్’​ పేరిట మే 7 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న 72వ ఎడిషన్​ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ,  టూరిజం, కల్చరల్ ​సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రకటించారు. మే 7న వేడుకలు మొదలై నాలుగు వారాలపాటు కొనసాగుతాయని, మే 31న గ్రాండ్​ ఫినాలే ఉంటుందన్నారు. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ థీమ్​తో నిర్వహించే ఈ కాంటెస్ట్ లో 120కి పైగా  దేశాలు పాల్గొంటాయని చెప్పారు.