జీవ వైవిధ్య పరిరక్షణకు యువ హైదరాబాద్​ డిక్లరేషన్

జీవ వైవిధ్య పరిరక్షణకు యువ హైదరాబాద్​ డిక్లరేషన్

తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని కన్హా శాంతివనంలో మూడు రోజులపాటు మొదటి జాతీయ యువ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో జీవ వైవిధ్య పరిరక్షణకు, పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న యువకుల ఉమ్మడి ఆకాంక్షలు, ఆందోళనలు, పరిష్కారాలను ఒకచోట చేర్చి తొమ్మిది ఆచరించతగిన అంశాలతో కూడిన హైదరాబాద్​ డిక్లరేషన్​ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ ప్రకటించారు. 

డిక్లరేషన్​లోని అంశాలు
    

  • సహజ వనరులను విచక్షణతో వినియోగించేలా యువతకు సాంకేతికత నైపుణ్యాలను అందించేలా పర్యావరణ సంస్థలకు మద్దతు ఇవ్వడం. 
  •     
  • పాఠశాలల్లో అనుభవపూర్వకమైన అభ్యాస పద్ధతులను తప్పనిసరి చేయడం.
  •     
  • ఉన్నత విద్యా సంస్థల ద్వారా అవగాహన పెంచడం.
  • సంప్రదాయ జ్ఞానాన్ని సంరక్షించడం, జీవనోపాధిని సృష్టించడం.
  • పరస్పరంగా జ్ఞానాన్ని పంచుకునేందుకు స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడం.
  • యువ ఆవిష్కరణల మార్కెట్​ను సృష్టించడం.
  • పర్యావరణ అనుకూల జీవన ఉపాధి నమూనాలను అభివృద్ధి చేయడం.
  • జీవ వైవిధ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం.
  • జీవ వైవిధ్య పరిరక్షణపై చట్టపరమైన అవగాహనను పెంచడం.