శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు. ఈనెల 30 వరకు సిటిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారుతి. రేపు సాయంత్రం 4:15 హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రెసిడెంట్. అక్కడినుంచి బొల్లారం రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ వెళ్లనున్నారు. దీంతో రేపు సాయంత్రం బొల్లారం నుంచి సోమాజిగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు పోలీసులు. ఆయా రూట్లలో వెళ్లేవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. షామీర్ పేట్ నుంచి సిటీకి వచ్చేవారు మేడ్చల్, కొంపల్లి, సుచిత్ర, బోయిన్ పల్లి, తాడ్ బండ్ ద్వారా సిటీలోకి ఎంటర్ అవ్వాలని చెబుతున్నారు. లేదా షామీర్ పేట్ బిట్స్ పిలాని నుంచి కీసర,- ఘట్కేసర్- ఉప్పల్,- తార్నాక మీదుగా సిటీలోకి రావాలంటున్నారు.
ఈనెల 27న నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఓ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్ గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు . దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బొల్లారం నుంచి నారాయణగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. లోతుకుంట, తిరుమలగిరి, కార్ఖానా, టివోలి, ప్యారడైజ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ జంక్షన్స్ ని అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సాయంత్రం ఆరాంఘర్ లో మరో ప్రైవేట్ ప్రోగ్రాంలో రాష్ట్రపతి పాల్గొంటారు. బొల్లారం నుంచి ఆరాంఘర్ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. బొల్లారం నుంచి తిరుమలగిరి, కార్ఖానా, ప్యారడైజ్, బేగంపేట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, మాసాబ్ ట్యాంక్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే మీదుగా ఆరాంఘర్ వెళ్లనున్నారు. దీంతో ఈ రోడ్ లో కాకుండా ఆల్టర్నేట్ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఈ నెల 28న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బొల్లారం నుంచి అల్వాల్ రూట్ లో ట్రాఫిక్ ని అనుమతించబోమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 29న షేక్ పేట్ వెళ్లనున్నారు. బొల్లారం నుంచి తిరుమలగిరి, కార్ఖానా, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్ నుంచి షేక్ పేట్ వెళ్లనున్నారు. సాయంత్రం శంషాబాద్ లో ఓ ప్రోగ్రామ్ కి వెళ్లే అవకాశం ఉందని.. శంషాబాద్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్1, బేగంపేట్, ప్యారడైజ్, కార్ఖానా, తిరుగమలగిరి రూట్లలో సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వెళ్లకపోవడం బెటర్ అంటున్నారు. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ కి వచ్చి వెళ్లనున్నారు.