రియల్టీకి అద్భుత భవిష్యత్​

రియల్టీకి అద్భుత భవిష్యత్​
  • రియల్టర్లకు అన్ని విధాలా సహకరిస్తం
  • భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం
  • గతంలోనూ ఎంతో చేశాం 
  • క్రెడాయ్​స్టేట్​కాన్​లో మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్​, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప– ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుప్రకటించిన  ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రియల్ ఎస్టేట్,  నిర్మాణ పరిశ్రమ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర  పౌరసరఫరాలు,  నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌‌‌‌‌‌‌‌ఐసీసీ)లో మంగళవారం 'తెలంగాణ గోయింగ్ గ్లోబల్' అనే థీమ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. నగరంలో ఆస్తులకు ఎంతో డిమాండ్​ ఉందన్నారు. ఇక్కడ పెట్టుబడులపై చాలా మందికి ఆసక్తి ఉందని చెప్పారు. 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 162 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వే, హైదరాబాద్ మెట్రో రైలు, నదీజలాల తాగునీటి సరఫరా వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ రంగ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి,  వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌కాన్ 2024ని నిర్వహించింది.     

భారీ ప్రాజెక్టులు వస్తున్నయ్​...

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ముచ్చెర్ల వద్ద ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీ, స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ, మెట్రోరైలు విస్తరణ, మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను  ప్రస్తుత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రకటించిందని ఉత్తమ్​ వివరించారు. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాల వృద్ధికి సాయపడతాయని చెప్పారు. తమ ప్రభుత్వ కృషితో తెలంగాణవ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.  

తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డును తీసుకురావడంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రెడాయ్ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రియల్టర్లకు అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్  నిర్మాణ పరిశ్రమ  కీలకమని అన్నారు.

మరిన్ని వార్తలు