హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వాహనాలకు అనుమతి

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో వాహన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నందిగామ మండలంలో మున్నేరు వాగుకు వరద ఉదృతి తగ్గుముఖం పట్టినందున అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు.   

అతివేగంగా వాహనాలు నడపొద్దు

ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద ఉన్న పాత బ్రిడ్జి ద్వంసమైనందున కొత్త బ్రిడ్జిపై నుండి మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పి శ్రీ సన్ ప్రీత్ సింగ్ వాహనదారులకు సూచించారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వంతెనపై నుంచి అతి వేగంగా వాహనాలు నడపొద్దని కోరారు.