
హైదరాబాద్, వెలుగు: నితేశ్ రెడ్డి (115), కెప్టెన్ రాహుల్ సింగ్ (108) సెంచరీలతో సత్తా చాటడంతో రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మిజోరంతో మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఆధిక్యం సాధించింది.
ఓవర్‌నైట్ స్కోరు120/1తో ఆట కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు, శనివారం చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 458/8 స్కోరు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (91), రోహిత్ రాయుడు (60) కూడా రాణించారు. ప్రస్తుతం కార్తికేయ (36 బ్యాటింగ్), సంకేత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ 259 రన్స్ లీడ్‌లో ఉంది.