కులులో ప్యారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి..

కులులో ప్యారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి..

హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సోయగాలను చూడాలని వెళ్లిన హైదరాబాద్ యాత్రికుడు కులు జిల్లాలో మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. టూర్ లో భాగంగా రైసన్ ప్యారాగ్లైడింగ్ సైట్  లో ప్యారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. రైసన్ ప్రాంతంలో ఒక్కసారిగా బలమైన గాలులు రావడంతో 25 నుంచి 30 అడుగుల ఎత్తునుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి చివరికి మృత్యువాత పడ్డాడు. 

హైదరాబాద్ కు చెందిన మహేష్ రెడ్డి (31) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం భుంటార్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని కండిషన్ క్రిటికల్ గా ఉండటంతో నెర్చౌక్ లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహేష్ రెడ్డిని కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని డాక్టర్లు వెల్లడించారు. 

ALSO READ | పగలంతా HR పని.. రాత్రుల్లో అమ్మాయిల వేట.. 700 మందిని ఏం చేశాడంటే..!

ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కులు జిల్లా ఎస్పీ కార్తికేయన్ గోకుల్ చంద్రన్ తెలిపారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని, ప్యారా గ్లైడింగ్ సమయంలో సేఫ్టీ మెజర్స్ వాడారా లేదా అనే కోణంలో దర్యాపు జరుపుతున్నట్లు వెల్లడించారు.