- ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్
హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్ ఇయ్యట్లేదన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
ఫేక్ పోస్టులతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పెండింగ్ చలాన్లపై అధికారిక సమాచారం ఉంటే https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో అప్ డేట్ చేస్తామన్నారు. చలాన్లపై సందేహాల కోసం 040-27852772 , 27852721 నంబర్లను సంప్రదించాలన్నారు.