ఆగష్టు 25న మారథాన్..సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆగష్టు 25న మారథాన్..సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్​లో ఈ నెల 25న మారథాన్​13వ ఎడిషన్ జరగనుంది. ​42 కి.మీ., 21 కి.మీ., 10 కి.మీ. రన్ నెక్లెస్​ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై హైటెక్స్​మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగే ఈ మారథాన్​రూట్​లలో ట్రాఫిక్​ డైవర్షన్​అమలు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్​ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఫుల్ మారథాన్​(42 కి.మీ.) పీపుల్స్​ ప్లాజా వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్, రోడ్డు నం 45, కేబుల్​ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్​ సిటీ, మైహోం అబ్రా, ఐకియా రోటరీ, ట్రాన్స్​కో, బయోడైవర్సిటీ, జంక్షన్​, టెలికాంనగర్​, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, త్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్​సీయూ క్యాంపస్​ గేట్​నం.2 నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.

హాఫ్​ మారథాన్​ సాగనుందిలా..

హాఫ్​ మారథాన్​(21కి.మీ) పీపుల్స్​ ప్లాజా వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్​, రోడ్డు నం 45, కేబుల్​ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్​ సిటీ, మైహోం అబ్రా, ఐకియా రోటరీ, ట్రాన్స్​కో, బయోడైవర్సిటీ, జంక్షన్​, టెలికాంనగర్​, గచ్చిబౌలి ఫ్లైఓవర్​, ఇందిరానగర్, త్రిపుల్ ఐటీ జంక్షన్​మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.10 కి.మీ. మారథాన్​హైటెక్స్​లోని న్యాక్​ గేట్​ వద్ద ప్రారంభమై సీఐఐ జంక్షన్, జీఏటీఐ యూటర్న్​, రెయిన్​బో హాస్పిటల్స్

ALSO READ : నిలోఫర్లో ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్ మెంట్

 టెక్​మహీంద్ర గేట్, ఎన్​ హైట్స్, టెక్​మహీంద్ర బ్యాక్ సైడ్​యూటర్న్, ఫైర్​ స్టేషన్​ రోడ్, డెల్ జంక్షన్, సైబర్​పెరల్​లేన్, హెచ్ఎస్​బీసీ ఎగ్జిట్​జంక్షన్​, లెమన్​ ట్రీ జంక్షన్​, ఐకియా రోటరీ, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, త్రిపుల్ ఐటీ జంక్షన్​ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.