నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్గా మీకీ విషయం తెలియాలి..!

నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్గా మీకీ విషయం తెలియాలి..!

హైదరాబాద్: కూకట్పల్లి-నిజాంపేట వైపు నుంచి JNTU రూట్లో వెళ్లే వారికి ముఖ్య గమనిక. నిజాంపేట-జేఎన్టీయూ మధ్య కవితా జ్యువెలర్స్ సమీపంలో రోడ్డు కుంగిపోయింది. వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

కొలను రాఘవ రెడ్డి గార్డెన్ నుంచి JNTU చేరుకోవడానికి వాహనదారులు మళ్లింపు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో కూకట్పల్లి ఒకటి. మాములుగానే కూకట్ పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. ఇక.. ఇలా రోడ్లు కుంగడం, వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడం వంటివి జరిగితే ఆ ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది.

ALSO READ | ఖైరతాబాద్, లక్డీకపూల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ తనిఖీలు.. రెస్టారెంట్ ఓనర్‎పై సీరియస్

సిటీలోనే మెయిన్ రోడ్డు కావడం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వెళ్లే బస్సులు కూడా రాకపోకలు సాగిస్తుండటం, ఐటీ జాబ్స్ చేసే ఉద్యోగులు కూకట్పల్లిలోనే ఎక్కువగా స్థిరపడి ఉండటం ఇలా.. పలు కారణాలు కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్కు కారణమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆఫీస్లకు వెళ్లే వాళ్లు, ఆఫీస్ల నుంచి వచ్చే వాళ్లతో కూకట్పల్లి రోడ్డు కిటకిటలాడుతుంటుంది. అంతేకాకుండా.. కూకట్పల్లిలో కోచింగ్ సెంటర్లు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో స్టూడెంట్స్ కూడా ఈ ఏరియాకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు.