- పాదచారుల కోసం స్పెషల్ సిగ్నల్
- పెలికాన్తో రోడ్ క్రాసింగ్
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతోంది. బిజీ రోడ్లపై సిగ్నల్స్ వద్ద రోడ్ క్రాస్ చేయాలంటే పెడెస్ట్రియన్స్ కు కష్టంగా మారింది. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. హెవీ ట్రాఫిక్‌లో రోడ్ క్రాస్ చేయాలంటే చైన్ సిస్టమ్ పాటించాల్సిందే. కొంతమంది వాహనదారులు హై స్పీడ్, నెగ్లెక్ట్ డ్రైవింగ్‌తో పెడెస్ట్రియన్స్ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో సిగ్నల్స్ వద్ద రోడ్ క్రాస్ చేసేందుకు పెడెస్ట్రియన్స్ భయపడుతున్నారు. దీంతో ఇలాంటి హెవీ ట్రాఫిక్ ఏరియాల్లో పెడెస్ట్రియన్స్ కోసం స్పెషల్ సిగ్నల్స్ ను ట్రాఫిక్ సిబ్బంది ఆపరేట్ చేస్తున్నారు. రోడ్ క్రాసింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పెలికాన్ (పెడెస్ట్రియన్ లైట్ కంట్రోల్ యాక్టివేషన్) సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మెహిదీపట్నం,దిల్‌సుఖ్‌నగర్,కూకట్‌పల్లిలో నాలుగు పెలికాన్ సిగ్నల్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లో సిగ్నల్స్ సక్సెస్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఏరియా వైస్ రూట్ మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నారు.
మరో 100 సిగ్నల్స్ ఏర్పాటుకు ప్లానింగ్
కూకట్‌పల్లి,మెహిదీపట్నం,దిల్‌సుఖ్‌నగర్ లో సిగ్నల్స్ స్టడీ రిపోర్టును పోలీసులు పరిశీలించారు. దీంతో ఇప్పటికే గుర్తించిన బిజీ రోడ్లపై పెడెస్ట్రియన్స్ కోసం మరిన్ని సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ ప్రిపేర్ చేశారు. గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల లిమిట్స్‌లో సుమారు100 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. జీహెచ్‌ఎంసీ అప్రూవల్ తర్వాత సిటిజన్లకు అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్కూల్స్,బస్‌స్టేషన్స్,పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రాంతాలను గుర్తించారు. మహిళలు,వృద్ధులు,స్టూడెంట్స్ రోడ్ క్రాసింగ్స్ కోసం టెక్నాలజీతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా పనిచేస్తయ్
పెలికాన్ సిగ్నల్స్ కూడా రెడ్ అండ్ గ్రీన్ లైట్స్‌తో ఆపరేట్ చేస్తారు. రోడ్ విస్తీర్ణం,వెహికల్స్,పబ్లిక్ మూవ్‌మెంట్‌ను బట్టి 10– 30 సెకన్స్ టైమ్ ఫిక్స్ చేస్తారు. రెండు వైపులా సేమ్ టైమ్‌లో రెడ్ సిగ్నల్ ఆపరేట్ అవుతుంది. రెడ్ లైట్ పడిన వెంటనే వెహికల్స్ ఆగిపోతాయి. పెడెస్ట్రియన్స్ జీబ్రా క్రాసింగ్‌పై నుంచి నడిచే మార్క్‌తో గ్రీన్ సిగ్నల్ వెలుగుతుంది. దీంతో రెండు వైపుల ఉన్న పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేస్తారు. పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేశాక మళ్ళీ వెహికల్స్ మూవ్ మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఆపరేట్ చేస్తున్నారు. ఇలాంటి చోట్ల పెడెస్ట్రియన్స్ కూడా సిగ్నల్స్‌ను ఫాలో కావాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
రోడ్ క్రాసింగ్ ఈజీ
నేను ఐడీఏ బొల్లారంలో ఉంటా. మూడ్రోజుల క్రితం మా కూతురితో కలిసి కూకట్‌పల్లిలో షాపింగ్‌కి వెళ్లా, సాయంత్రం ఫుల్ ట్రాఫిక్‌తో రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యింది. జెన్‌టీయూ వద్ద ఉన్న పెలికాన్ సిగ్నల్ దగ్గరికి వెళ్లా. అక్కడ రోడ్ క్రాసింగ్ ఈజీ అయ్యింది. బిజీగా ఉండే రోడ్స్‌పై పెలికాన్ సిగ్నల్స్ ను మరిన్ని ఏర్పాటు చేయాలి. ‑ అశ్విని, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, ఐడీఏ బొల్లారం.
ఇవి కూడా చదవండి
టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం
పెద్దసార్లు దిగరు.. కొలువులు రావు
అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్
మిసెస్ ఇండియా రన్నరప్‌గా ఖమ్మం మహిళ