Hyderabad: కిక్ దింపుతున్నారు : ఒకే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో 200 దొరికితే.. 70 మంది జైలుకు..

Hyderabad: కిక్ దింపుతున్నారు : ఒకే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో 200 దొరికితే.. 70 మంది జైలుకు..

హైదరాబాద్లో తాగి వాహనాలు నడుపుతున్న మందు బాబులకు పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీకెండ్స్ తాగేసి రోడ్లపై వాహనాలతో హల్చల్ చేస్తూ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్లో పెడుతున్న మందుబాబుల తాట తీసేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గత శనివారం ఒక్కరోజే 298 మంది తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్లో అడ్డంగా దొరికిపోయారు. వీరిలో 70 మందికి 2 నుంచి 8 రోజుల వరకూ జైలు శిక్ష కూడా పడింది. మోటార్ వెహికల్స్ చట్టం సెక్షన్ 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 10 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. గత 15 రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2,483 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకబట్టారంటే సిటీలో మందుబాబులు రోడ్లపై ఎంతలా హల్చల్ చేస్తున్నరో అర్థం చేసుకోవచ్చు.

గడచిన 15 రోజుల్లో పలు కోర్టుల్లో 1,543 ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు. 158 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది. 12 మంది డ్రైవింగ్ లైసెన్స్లను 3 నుంచి 6 నెలల పాటు రద్దు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్లలో ఎక్కువ మంది టూ-వీలర్ వాహనదారులే ఉండటం గమనార్హం. హైదరాబాద్ పరిధిలో గడచిన 15 రోజుల్లో 2,483 మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా.. వీరిలో 2,034 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. అంటే దాదాపు 82 శాతం మంది మందుబాబులు బైక్లు, స్కూటీలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయారు.