కారు ఒకరిది..చలానా పడింది మరొకరికి

కారు ఒకరిది..చలానా పడింది మరొకరికి

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులనుంచి చలానాలు వసూలు  ట్రాఫిక్ పోలీసులు వసూలు చేయడం కామన్. నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడితే  స్పాట్ లోనే వాహనదారులను నుంచి  ఫైన్లు వసూలు చేస్తారు. లేదంటే వెహికిల్ సీజ్ చేస్తారు. రూల్స్ ను బ్రేక్ చేస్తూ వెళ్లేవారిని పోలీసులు ఫొటోలు తీసి వారి అడ్రస్ కు చలానాలు పంపించి వారి నుంచి చలానాలు వసూలు చేస్తుంటారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒకరికి వెళ్లాల్సిన చలానా నోటీసు మరొకరి చేరింది. దీంతో వాహనదారుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఓవర్ స్పీడ్ తో వెళ్లిన ఓ కారుకు వెయ్యిరూపాయల ఫైన్ విధిస్తూ మెసేజ్ పంపారు. మెసేజ్ చూసుకున్న వాహనదారుడు ఆశ్చర్యపోయాడు. చలానాలో తెలిపిని టైంకి..తాను ఆఫీసులో ఉన్నాడు. చలానా ను వెబ్ సైట్లో పరిశీలిస్తే.. ట్రాఫిక్ వాయిలేషన్ కు గురైన వెహికిల్ కు వాహనదారుడి వెహికిల్ కు అసలు సంబంధం లేదు. చలానా పడింది  కియా సెల్టోస్ కారు కు దాని నెంబర్ TS07HK0999. కానీ వాయిలేషన్ గురైంది TS07HK6999 ఫార్చునల్ కారు. ఈ పొరపాటును అధికారుల దృష్టికి తీసుకెళ్తే..చలానా జనరేట్ అయ్యింది కారు నంబర్ ఆధారం కాబట్టి..దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.