GHMC పట్టించుకోలేదు: గుంతల రోడ్డును పోలీసే బాగుచేశాడు

GHMC పట్టించుకోలేదు: గుంతల రోడ్డును పోలీసే బాగుచేశాడు

నగరంలో పడుతున్న వానలకు పలుచోట్ల రోడ్లు పాడయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కొన్నిచోట్ల రోడ్లపై ఇసుకతేలి టూవీలర్లు స్లిప్ అవుతుండగా… మరి కొన్ని చోట్ల రోడ్లు పెద్ద పెద్ద గుంతలతో రాకపోకలకు చాలా కష్టమవుతుంది. అయితే గుంతలను పూడ్చాల్సిన GHMC అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు.

బహదూర్ పురా లోని రోడ్లు తీవ్రంగా గుంతలు పడ్డాయి. అయితే శనివారం పొద్దున జుబేర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్లపై ఏర్నడిన గుంతలపై తానే స్వయంగా డాంబర్‌ వేసి పూడ్చాడు. దీంతో పలువురు ఆ కానిస్టేబుల్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. రోడ్లను మరమ్మత్తులు చేయాల్సిన పని కానిస్టేబుల్ ది కాకపోయినా  అతను చూపిన చొరవను అభినందిస్తున్నారు.