హ్యాట్సాఫ్ సార్: ఎండదెబ్బకు కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు..

హ్యాట్సాఫ్ సార్: ఎండదెబ్బకు కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు..

అత్యంత బాధ్యతాయుతమైన జాబ్స్ లో పోలీస్ జాబ్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా సామజిక బాధ్యతతో వ్యవహరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పోలీసులు. అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తికి పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్బాలు చాలా చూశాం.. తాజాగా హైదరాబాద్ లో ఎండదెబ్బకు పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు పోలీసులు. ఆదివారం ( మార్చి 16, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

అపస్మరక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆసుపత్రి కి తరలించారు..బేగంపేట పిటీఐ జంక్షణ్ వద్ద రోడ్డు దాటుతు సురేష్ అనే  వ్యక్తి రోడ్డు పై పడిపోయడు..ఎండ తీవ్రత కారణంగా  ఎండదెబ్బకోట్టి అపస్మరక స్థితిలోకి వెళ్ళాడు. ఇది గమనించిన బేగంపేట ట్రాఫిక్ సీఐ పాపయ్య వెంటనే అతన్ని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకవచ్చి ..ట్రాఫిక్ సిబ్బంది చేత సీపీఆర్ చేయించారు.

అతను అపస్మరక స్థితి నుంచి స్పృహలోకి రాగానే వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి  తరలించారు.విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో సీపీఆర్ ద్వారా అతన్ని ప్రాణలు కాపాడి ..అతని వద్ద ఉన్న మోబైల్ ఆధరంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.ఆ వ్యక్తి  ఆదిలాబాద్ కు చెందిన సురేష్ గా పోలీసులు గుర్తించారు పోలీసులు.