శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్..

 హైదరాబాద్లో  శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్ లో వెళ్లే వారికి అలర్ట్.  ఆగస్టు 3 నుంచి  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఎందుకంటే  రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పరిధిలో ఆరు లేన్ల ప్రధాన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా  కిషన్ గూడ ర్యాంప్ లోని  ఎయిర్ పోర్ట్  నుంచి హైదరాబాద్ అప్రోచ్ రోడ్డు ఆగస్టు 3 నుంచి 45 రోజుల పాటు రోడ్డును మూసి వేయబడుతుంది.

Also Read :- రాంగ్ రూట్ లో బైక్ ను ఢీకొట్టిన కారు

దీంతో ఎయిర్ పోర్టునుంచి  హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను బెంగళూరు వైపు మళ్లిస్తున్నారు.  NH-44లో ORR ఎమర్జెన్సీ ట్రామా సెంటర్  దగ్గర యూటర్న్ తీసుకోవాలి.  అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టు వైపు వెళ్లే వాహనాలను యథావిధిగా వెళ్లవచ్చని తెలిపారు పోలీసులు. వాహనదారులు సహకరించాలని కోరారు పోలీసులు.