
ప్రపంచదేశాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం హైదరాబాద్‌పైనా పడింది. యూఎస్ ఎయిడ్ నిధులు నిలిచిపోవడంతో హైదరాబాద్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూతపడింది.
నగరంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సహాయాలు అందించే మిత్ర్ క్లినిక్(Mitr Clinic) డోర్లు మూతపడ్డాయి. దీన్ని 2021 జనవరిలో స్థాపించారు. ఈ క్లినిక్ దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం. సాధారణ ఆరోగ్య సంప్రదింపులు, HIV కౌన్సెలింగ్ మరియు చికిత్స, లింగ నిర్ధారణ సేవలు, చట్టపరమైన, సామాజిక పథకాలు పొందడంలో సహాయం వంటి ముఖ్యమైన సేవలు అందిస్తోంది.
ALSO READ : మీ కోసమే: ఇవాళ్టి(మార్చి1) నుంచి ఈ రూల్స్ అన్నీ మారాయి.. మర్చిపోవద్దు నోట్ చేసుకోండి..!
LGBTQIA+ కమ్యూనిటీ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఈ క్లినిక్‍ది కీలక పాత్ర. నెలకు 150 నుండి 200 మంది సేవలు పొందేవారు. అటువంటిది విదేశీ సాయం నిలిచిపోవడంతో మూత పడింది. ఈ క్లినిక్‌లో ఏడుగురు ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనేది అయోమయం.
ఎలాన్ మస్క్ స్పందన
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మిత్ర్(Mitr) మూతపడటంపై టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. "అమెరికన్ పన్ను డాలర్లు నిధులు సమకూర్చేది అదే.." అని ఎక్స్(X)లో ట్వీట్ చేశారు. మస్క్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. దేశంలో ఇటువంటి సేవలు అందిస్తున్న క్లినిక్‌లు మూతపడతాయి అన్నట్లుగా అతని వ్యాఖ్యలు ఉండటమే అందుకు కారణం.
That’s what American tax dollars were funding https://t.co/E4IQSoj9NV
— Elon Musk (@elonmusk) February 28, 2025