అహ్మదాబాద్ : ఆరవెల్లి అవనీష్ (100) సెంచరీతో చెలరేగడంతో.. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ చేసింది. శనివారం జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో హైదరాబాద్ 42 రన్స్ తేడాతో నాగాలాండ్‌పై గెలిచింది. తొలుత హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటైంది.
తన్మయ్ (51), వరుణ్ గౌడ్ (57) కూడా రాణించారు. ఛేజింగ్‌లో నాగాలాండ్ 50 ఓవర్లలో 234/8 స్కోరుకే పరిమితమైంది. యుగంధర్ సింగ్ (80), జగదీశ్ సుచిత్ (66) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ముదాసిర్, నిశాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.