
హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ లో మరమ్మత్తులు చేస్తుండగా ముగ్గురు జీహెచ్ఎంసీ కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికులు ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మృతి చెందారు. పురానాపూల్ బ్రిడ్జి సమీపంలో మ్యాన్ హోల్ లో మరమ్మత్తులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.