
బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో GHMC అధికారులు సీజ్ చేశారు. కోటీ 43 లక్షల ట్యాక్స్ పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. పన్ను చెల్లించాలని పలుసార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో హోటల్ను అధికారులు సీజ్ చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని స్టార్ హోటల్ అయిన తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడంతో ఈ హోటల్ వార్తల్లో నిలిచింది. ఈ హోటల్ నిర్వాహకులు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేయడంతో పాటు పలు మార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. రెండు సంవత్సరాలుగా సదరు హోటల్ 1 కోటి 40 లక్షల పన్ను బకాయి ఉంచారని.. ఎంతకు స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.