అసని తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖకు విమానాలు రద్దు

బంగాళాఖాతంలో అసని తీవ్ర తుఫాను కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్, విశాఖ, జైపూర్, ముంబై వెళ్లే ఫ్లైట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది ఇండిగో. ఎయిర్ ఏషియాకు చెందిన ఢిల్లీ-విశాఖ, బెంగళూరు-విశాఖ సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ముంబై-రాయ్ పూర్- విశాఖ, ఢిల్లీ-విశాఖ ఫ్లైట్లు రద్దయ్యాయి. తుఫాను దృష్ట్యా తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్తగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించాయి విమానసంస్థలు.