హైదరాబాద్: ఇరు జట్లు బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో.. హైదరాబాద్, ఆంధ్ర మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి ఐదో రౌండ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో హైదరాబాద్‌కు ఒకటి, ఆంధ్రకు మూడు పాయింట్లు లభించాయి. 448/9 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 143.5 ఓవర్లలో 448 స్కోరు వద్దే ఆలౌటైంది.
ఐదు బాల్స్ ఆడిన యరా సందీప్ (33) ఒక్క రన్ కూడా జోడించలేదు. అనికేత్ రెడ్డి 4, రక్షణ్ రెడ్డి 3, చామ మిలింద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 193/1 స్కోరు చేసింది. తన్మయ్ అగర్వాల్ (95), అభిరత్ రెడ్డి (70 నాటౌట్) తొలి వికెట్‌కు 148 రన్స్ జత చేశారు. రోహిత్ రాయుడు (19 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మహ్మద్ రఫీ ఒక్క వికెట్ తీశాడు. షేక్ రషీద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.