ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం ( మే 21) క్వాలిఫయర్ 1 జరగనుంది. లీగ్ దశలో టాప్ 2 లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ బెర్త్ పై కన్నేశాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్, సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 లో మార్పులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం
మార్కో జాన్సెన్ కు ఛాన్స్
ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుండడంతో సన్ రైజర్స్ తుది జట్టులో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ కు ఈ మ్యాచ్ లో అవకాశం దక్కొచ్చు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. దీంతో శ్రీలంక స్పిన్నర్ విజయ్ కాంత్ బెంచ్ కు పరిమితం కావచ్చు. ఉనాద్కట్ కు ఈ మ్యాచ్ లో అవకాశం ఇవ్వనున్నట్లు సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తోందట. త్రిపాఠి స్థానంలో షాబాజ్ అహ్మద్ జట్టులో చేరడం దాదాపుగా ఖాయమైంది. దీంతో క్వాలిఫయర్ 1 లో కమ్మిన్స్ సేన మూడు భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాల్ట్ లేకుండానే
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జోరు మీదున్న ఓపెనర్, కీపర్ ఫిల్ సాల్ట్ (435 రన్స్) లేకపోవడం మైనస్ అనొచ్చు. పాకిస్థాన్ పై టీ 20సిరీస్ కారణంగా సాల్ట్ ఇంగ్లాండ్ స్క్వాడ్ లో ఉన్నాడు. దీంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఈ సీజన్ లో సాల్ట్ మరో ఓపెనర్ సునీల్ నరైన్‌తో కలిసి అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసిన సాల్ట్ కేకేఆర్ విజయాలకు బాటలు వేశాడు. అతని స్థానాన్ని రహ్మనుల్లా గర్బాజ్ ఏ మేరకు భర్తీ చేస్తాడో చూడాలి. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే కేకేఆర్ జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
ఈ సీజన్ లో ఇరు జట్లు ఒకటే మ్యాచ్ ఆడాయి. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ ముఖా ముఖి రికార్డ్ లో మొత్తం 26 మ్యాచ్ లు జరిగితే కేకేఆర్ 17, సన్ రైజర్స్ 9 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.
It's Knight Riders vs Sunrisers! 🟣🟠
— Sportskeeda (@Sportskeeda) May 21, 2024
Kolkata Knight Riders and Sunrisers Hyderabad will battle in the Qualifier 1 Playoff of IPL 2024⚡👊
Who will reach the final tonight❓🤔#IPL2024 #KKRvSRH #CricketTwitter pic.twitter.com/DyJUIvsSmK