
హైదరాబాద్, వెలుగు: పుదుచ్చేరితో రంజీ ట్రోఫీ గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. తన్మయ్ అగర్వాల్ (173) భారీ సెంచరీకి తోడు రోహిత్ రాయుడు (84), హిమతేజ (60) దంచికొట్టడంతో.. 290/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 163 ఓవర్లలో 536/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్) కూడా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో 24/2 స్కోరు చేసింది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి ఇంకా 512 రన్స్ వెనకబడి ఉంది.